Find Articles

‘జన నాయగన్’తో విజయ్ హిస్టారిక్ హ్యాట్రిక్!

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యం, సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జన నాయగన్’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, ఏ భారతీయ నటుడికి సాధ్యంకాని అరుదైన మైలురాయిని విజయ్ తన సొంతం చేసుకున్నారు.

టికెట్ల అమ్మకాల్లో ‘మిలియన్’ సునామీ!

‘జన నాయగన్’ చిత్రం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం ప్రీ-సేల్స్‌లోనే ఏకంగా 10 లక్షలకు పైగా (1 మిలియన్) టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. విడుదలకు ముందే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం తమిళ సినీ పరిశ్రమలోనే కాక, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఇండియన్ సినిమాలో ఏకైక హీరోగా రికార్డ్!

ఈ అద్భుతమైన మార్క్‌ను అందుకోవడంతో విజయ్ ఒక సరికొత్త రికార్డును నెలకొల్పారు. వరుసగా మూడు సినిమాలకు కేవలం ప్రీ-సేల్స్ బుకింగ్స్‌లోనే వన్ మిలియన్ (10 లక్షలు) టికెట్ల విక్రయాలు సాధించిన తొలి భారతీయ హీరోగా విజయ్ చరిత్ర సృష్టించారు.

గతంలో ఆయన నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘వారిసు’ (Varisu), ఆ తర్వాత వచ్చిన విజువల్ వండర్ ‘ది గోట్’ (The GOAT) చిత్రాలు కూడా విడుదలకు ముందే పది లక్షలకు పైగా టికెట్ల సేల్స్‌ సాధించి రికార్డు సృష్టించగా.. ఇప్పుడు తాజాగా ‘జన నాయగన్’తో విజయ్ విజయవంతంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. థియేటర్లలోకి రాకముందే విజయ్ సృష్టిస్తున్న ఈ రికార్డులు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Keerthi