‘యానిమల్’ చిత్రంతో నేషనల్ క్రష్‌గా మారి, దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి (Triptii Dimri). వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఈ అమ్మడు.. స్టార్‌డమ్, హిట్లు-ఫ్లాప్‌ల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
“యానిమల్ సక్సెస్ ఆ స్వేచ్ఛనిచ్చింది!”
‘యానిమల్’ తెచ్చిన ఇమేజ్ గురించి త్రిప్తి మాట్లాడుతూ.. “ఆ సినిమా విజయం నాకు పరిశ్రమలో ఎంతో స్వేచ్ఛనిచ్చింది. అంతకుముందు నా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాల కోసం ఎదురుచూసేదాన్ని. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి నాపై నమ్మకం పెరిగింది. కేవలం నిలదొక్కుకోవాలనే భయంతో సినిమాలు చేయకుండా, నచ్చిన కథలను ఎంచుకునే స్వేచ్ఛ లభించింది. సినీ నేపథ్యం లేకపోవడం వల్లే నేను ఎప్పుడూ ఒదిగి ఉంటాను” అని వ్యాఖ్యానించారు.
‘ఓ రోమియో’ ఫ్లాప్‌పై క్లారిటీ!
షాహిద్ కపూర్ జంటగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓ రోమియో’ ఆశించిన విజయం సాధించకపోవడంపై స్పందిస్తూ.. “కమర్షియల్‌గా అది వైఫల్యం కావొచ్చు, కానీ దాన్ని నేను వ్యక్తిగత ఓటమిగా అనుకోను. నటీనటులు తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తారు, కాకపోతే కొన్నిసార్లు ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవచ్చు. సినిమా ఫలితాన్ని బట్టి మన ప్రతిభను అంచనా వేసుకోకూడదనే పాఠం ఈ చిత్రం ద్వారా నేర్చుకున్నాను” అని స్పష్టం చేశారు.