Find Articles

రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ సంచలన కామెంట్స్!

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌లు ‘టాక్సిక్’, ‘రామాయణ’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు. నితీష్ తివారి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో లంకేశుడిగా (రావణుడు) నటించడానికి గల కారణాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇగో పక్కన పెట్టి.. రావణుడి పాత్రలోకి!

“శ్రీరాముడిలోని అత్యున్నత మంచితనాన్ని, సుగుణాలను ప్రేక్షకులకు స్పష్టంగా చూపించాలంటే రావణుడి పాత్రను అంతే బలంగా తీర్చిదిద్దాలి, దానికి సరైన న్యాయం చేయాలి” అని యశ్ తెలిపారు. విలన్ పాత్రలకు తాను పూర్తి న్యాయం చేయగలననే నమ్మకం ఉందన్నారు. ఈ పౌరాణిక కావ్యం కోసం నటీనటులందరం ఇగోలను పక్కనబెట్టి ఒక బెస్ట్ టీమ్‌గా పనిచేస్తున్నామని చెప్పారు. కథ చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసినదే అయినప్పటికీ, మతపరమైన భావాలు దెబ్బతినకుండా సరికొత్త రీతిలో ప్రెజెంట్ చేయడం చాలా కష్టమైన పని అని, దీని కోసం నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ రిస్క్ తీసుకుంటున్నారని వెల్లడించారు.

రణ్‌బీర్, సాయిపల్లవితో మల్టీస్టారర్ ధమాకా!

ఈ విజువల్ వండర్‌లో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి కనిపిస్తుండగా, యశ్ రావణుడిగా నటిస్తూనే ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్ డ్రామా ‘రామాయణ: పార్ట్ 1’ ఈ దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది.

ఆగస్టు 26న ‘టాక్సిక్’ రచ్చ!

మరోవైపు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యశ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కియారా అద్వాణీ, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Keerthi