Find Articles

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై జి.వి.ప్రకాష్ సంచలన కామెంట్స్

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రత్యేక ముద్ర వేసిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఈ వార్తలు ఒక్కసారిగా కాకరేపగా, ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన ఆప్తమిత్రుడు జీవీ ప్రకాష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఏ నిర్ణయం తీసుకున్నా ధనుష్ వెంటే ఉంటా!

ధనుష్‌తో ఉన్న ప్రత్యేక బంధం గురించి విలేకరుల సమావేశంలో జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ధనుష్ నాకు అత్యంత ఆప్తమిత్రుడు. ఆయన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఎప్పుడూ అతడి వెంటే ఉంటాను. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే, నా పూర్తి మద్దతు తప్పకుండా ధనుష్‌కే ఉంటుంది” అని స్పష్టం చేశారు.

నెట్టింట జోరుగా చర్చ!

కోలీవుడ్‌లో ఇప్పటికే విజయ్ తన సొంత పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) ద్వారా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ బహిరంగంగా మద్దతు తెలపడంతో, ధనుష్ రాజకీయ ప్రవేశ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ కామెంట్స్‌తో ధనుష్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

Keerthi