Find Articles

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ లిరికల్ సాంగ్ లాంచ్!

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్‌పై పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న లేటెస్ట్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్‌ను ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విడుదల చేశారు. పాట లిరిక్స్, ట్యూన్స్ చాలా బాగున్నాయని కొనియాడిన ఆయన, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని చిత్రబృందాన్ని అభినందించారు.

అగ్ర నిర్మాతల మద్దతుతో జోరు పెంచిన ప్రమోషన్లు!

ఇప్పటికే వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, సురేష్ బాబు చేతుల మీదుగా మొదటి సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండవ పాటను దిల్ రాజు ఆవిష్కరించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సందర్భంగా దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ.. “ఎంతోమంది కొత్త వారికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు గారి చేతుల మీదుగా మా సాంగ్ లాంచ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక మంచి ఎమోషనల్ థ్రిల్లర్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. పాటలు, టీజర్‌కి మించి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.

చిత్రబృందం హర్షం!

సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధృవన్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారికి మ్యూజిక్‌లో ఉన్న మంచి టేస్ట్ అందరికీ తెలిసిందేనని, ఆయన పాటను మెచ్చుకోవడం తమకి పెద్ద బూస్ట్ ఇచ్చిందని తెలిపారు. అలాగే హీరో రామ్ కార్తీక్ కూడా దిల్ రాజు బ్లెస్సింగ్స్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు.

ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ శామ్ కె. నాయుడు కెమెరా విజువల్స్ అందిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, నళిని వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Keerthi