మోస్ట్ వర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐమ్ గేమ్’ (I’m Game). ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేయగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
‘యూ/ఏ’ సర్టిఫికెట్.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా!
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమాలో ఉన్న పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని సెన్సార్ సభ్యులతో పాటు చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
రన్‌టైమ్ ఎంతంటే?
ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 53 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ప్రతి క్షణం కట్టిపడేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారని తెలుస్తోంది.
https://x.com/dulQuer/status/2094738033241456696?s=20
మరో మాస్ హిట్ లోడింగ్!
వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే దుల్కర్ సల్మాన్, ఈ సినిమాలో తనదైన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. సెప్టెంబర్ 3న రాబోతున్న ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద దుల్కర్ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.