ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ నటి మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆమె ముందుగా అనుకున్న కీలక విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా టూర్ రద్దు.. ఓనం వేడుకలు వాయిదా!
సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన ‘క్లైడ్ ఓనం 2026’ వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఈ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ అధికారికంగా వెల్లడిస్తూ, మమిత హాజరుకాకపోవడంతో ఓనం వేడుకలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఆసుపత్రి నుంచే ఎమోషనల్ వీడియో!
ఈ మేరకు అసోసియేషన్ ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో మమితా బైజు స్వయంగా మాట్లాడుతుండటం కనిపిస్తుంది. ప్రయాణాలు చేయకూడదని వైద్యులు ఖచ్చితంగా సలహా ఇచ్చినందుకే ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని చెబుతూ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. త్వరలోనే కోలుకుని మళ్లీ మీ అందరినీ నేరుగా కలుసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ జోష్!
కాగా, మమితా బైజు ప్రస్తుతం కెరీర్‌పరంగా గోల్డెన్ ఫేజ్‌లో ఉన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆమె నటించిన మూడు చిత్రాలు విడుదలవుతూ హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన హిట్ మలయాళ చిత్రం ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం సెప్టెంబర్ 4న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి రానుంది. ఈ లోపే ఆమె అస్వస్థతకు గురవ్వడంతో ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
https://www.instagram.com/p/DcsywJqTBsD/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again