Find Articles

శ్రీ కృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్

కన్నడ వర్సటైల్ స్టార్ హీరో, ‘అభినయ చక్రవర్తి’ కిచ్చా సుదీప్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన అభిమానులకు మరియు ప్యాన్-ఇండియా సినీ ప్రియులకు ఒక బిగ్గెస్ట్ కింగ్-సైజ్ సర్‌ప్రైజ్ లభించింది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఎలుగెత్తి చాటిన చారిత్రక చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో సుదీప్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

‘దేవరాయ’ పవర్‌ఫుల్ టైటిల్.. బిగ్గెస్ట్ బ్యానర్స్ కాంబో!

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘దేవరాయ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు సుదీప్ సొంత బ్యానర్ సుప్రియ్యాన్వి పిక్చర్స్ సంయుక్తంగా ఈ భారీ పాన్-ఇండియా విజన్‌ను పట్టాలెక్కిస్తున్నాయి. ఈ విజువల్ వండర్‌కి ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడు గౌర హరి స్వరాలు అందిస్తున్నారు.

2027 డిసెంబర్‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్!

అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక మహోన్నత యుగాన్ని శాసించిన సమర్థవంతమైన రాజు పాత్రలో సుదీప్ కనిపించబోతుండటంతో అప్పుడే సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

సస్పెన్స్‌లో దర్శకుడి పేరు!

అయితే ఈ అనౌన్స్‌మెంట్‌లో ఒక ఆసక్తికర అంశం అందరినీ ఆకర్షించింది. సినిమా టైటిల్, కాన్సెప్ట్, నిర్మాతలు మరియు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు అనే విషయాన్ని మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. ఈ భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Keerthi