నేచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ నటుడు ప్రియదర్శి, యంగ్ బ్యూటీ నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఇడుపు కాయితం’. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వినూత్న టైటిల్‌తోనే అనౌన్స్‌మెంట్ రోజు నుంచి నెట్టింట తెగ ట్రెండ్ అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
‘విడాకుల పత్రం’ బ్యాక్‌డ్రాప్.. టైటిల్‌తోనే వివాదాస్పద బజ్!
సాధారణంగా తెలంగాణ యాసలో ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం (Divorce Paper) అని అర్థం. ఒక వైవాహిక బంధాన్ని తెంచే విడాకుల కాగితం చుట్టూ ఒక పక్కా తెలంగాణ ఫ్యామిలీ డ్రామాను రూపొందించడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది. కుటుంబ బంధాలు, విడాకుల కాన్సెప్ట్ వెనుక ఉండే ఎమోషన్స్ మరియు హ్యూమర్‌ను దర్శకుడు ఏ విధంగా తెరకెక్కించబోతున్నారోనని నెటిజన్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
‘శ్రీలత’ ఫస్ట్ సింగిల్ రీలిజ్.. ట్రెండింగ్ మ్యూజిక్!
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శుక్రవారం నాడు మేకర్స్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘శ్రీలత’ (Sreelatha) ను వైభవంగా విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ పాటకు అద్భుతమైన స్వరాలు సమకూర్చగా, అలరాజు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. శంకర్ బాబు కందుకూరి మరియు మోహన్ భోగరాజు కలసి ఈ పాటను ఎంతో ఎనర్జిటిక్‌గా ఆలపించారు.
తెలంగాణ నేటివిటీ, సంస్కృతి, కుటుంబ నేపథ్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రియదర్శి కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.