Find Articles

దసరా రేసులో రజనీ వర్సెస్ విజయ్!

ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ రేసు రోజురోజుకూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వాయిదా పడుతున్నాయంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ చిత్రబృందాలు తమ పనుల్లో వేగం పెంచాయి. దసరా పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ఈ రెండు భారీ ప్రాజెక్ట్‌లు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

‘జైలర్ 2’ రిలీజ్ పై సస్పెన్స్.. సన్ పిక్చర్స్ బిజినెస్ క్లియర్ కాలేదా?

సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘జైలర్ 2’ చిత్రాన్ని అక్టోబర్ 15న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషనల్ బిజినెస్ డీల్స్ మరియు థియేట్రికల్ అగ్రిమెంట్లు ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాకపోవడంతో రిలీజ్ డేట్‌పై స్వల్ప సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, సీక్వెల్ క్రేజ్ మరియు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ఆకాశమంత హైప్‌ను తెచ్చిపెట్టాయి.

రంగంలోకి ‘రణబాలి’.. నాన్‌స్టాప్ ప్రమోషన్లకు విజయ్-రష్మిక ప్లాన్!

మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ (VFX) వర్క్ తక్కువగా ఉండటంతో.. అక్టోబర్ మొదటి వారంలోనే సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసి, నాన్‌స్టాప్ ప్రమోషన్స్ ప్రారంభించాలని రాహుల్ సాంకృత్యాన్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది. విజయ్ డిఫరెంట్ గెటప్, భారీ బడ్జెట్ ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

సీనియర్ వర్సెస్ జూనియర్ ఫైట్!

ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ మాస్ మేనియా, మరోవైపు విజయ్ దేవరకొండ మాస్ అండ్ క్లాస్ అప్పీల్ ఉండటంతో ఈ దసరా ఫైట్ ‘సీనియర్ వర్సెస్ జూనియర్’ సమరంగా మారింది. రెండు సినిమాలపై విపరీతమైన అంచనాలు ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద విజేతగా ఎవరు నిలుస్తారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Keerthi