‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను విపరీతంగా వేగవంతం చేసింది.
నాని తల్లిగా సొనాలి కులకర్ణి.. పూనకాలు తెప్పించే క్యారెక్టర్!
ఈ సినిమాలో నాని సరసన కాయదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, రాఘవ్ జుయల్ మరియు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఈ చిత్రంలో నాని తల్లి పాత్రలో ప్రముఖ సీనియర్ నటి సొనాలి కులకర్ణి నటించారు. ఇటీవల ప్రముఖ యాంకర్ ప్రదీప్ నిర్వహించిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ తల్లి పాత్ర గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురవగా.. నాని ఇచ్చిన రిప్లై నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
“నిజంగానే ‘సమ్మక్క’ అని పెట్టి ఉంటే గూస్‌బంప్సే!”: నాని ఓపెన్ టాక్
తల్లి పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో వివరిస్తూ నాని మాట్లాడుతూ.. “ఈ సినిమాకి ‘ది ప్యారడైజ్’ కాకుండా మరో పేరు పెట్టాల్సి వస్తే మాత్రం కచ్చితంగా ‘సమ్మక్క’ అని పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఇది పూర్తిగా ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథే. ఒకవేళ నిజంగానే ఆ టైటిల్ పెట్టి ఉంటే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం” అని సంచలన కామెంట్స్ చేశారు.
నాని చేసిన ఈ వ్యాఖ్యలతో సినిమాలో తల్లి పాత్ర ఎంతటి ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లెవెల్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. రోక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.