మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ డైరెక్టర్ కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (Kaka). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవికి కుమార్తెగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన మెయిన్ హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారనేది ఇప్పటివరకు సస్పెన్స్‌గా మారగా.. తాజాగా ఆ లీడ్ నటి ఎవరనే దానిపై ఫిల్మ్‌నగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.
రామ్‌చరణ్ వదినగా చేసి.. ఇప్పుడు తండ్రితోనే రొమాన్స్!
తాజా సమాచారం ప్రకారం, మెగాస్టార్ సరసన ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న నటి మరెవరో కాదు.. హోమ్లీ బ్యూటీ, సీనియర్ నటి స్నేహ! గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో ఆయనకు వదిన పాత్రలో మెప్పించిన స్నేహ.. ఇప్పుడు తండ్రి చిరంజీవి కాంబినేషన్లో జోడీగా నటించబోతుండటం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సంచలన కాంబినేషన్‌పై ఇప్పటికీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
థమన్ మ్యూజిక్ మాజిక్.. కేవీఎన్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్!
‘వాల్తేరు వీరయ్య’ వంటి మైండ్ బ్లాకింగ్ హిట్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ (S. Thaman) సంగీతం అందిస్తున్నారు.