Find Articles

రాజకీయాల్లోకి మరో కోలీవుడ్ స్టార్ హీరో!

తమిళనాడు రాజకీయ వేదికపై ప్రస్తుతం నయా హీట్ రాజుకుంటోంది. దళపతి విజయ్ సొంత పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా పొలిటికల్ పవర్ చూపించిన తర్వాత, కోలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోల చూపు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలపై పడింది. ఈ వరుసలో తాజాగా క్రేజీ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) చేరడం తమిళనాట తీవ్ర కలకలం రేపుతోంది. చెన్నైలోని పోరూర్‌లో సుమారు 3 వేల మంది ఫ్యాన్స్, అసోసియేషన్ నిర్వాహకులతో అత్యంత గోప్యంగా, భారీ ఎత్తున నిర్వహించిన మీటింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

శివకార్తికేయన్ కామెంట్స్ వైరల్!

ఈ సమావేశంలో అసలు సంచలనం మరియు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ప్రధాన అంశం ఏమిటంటే.. శివకార్తికేయన్ పరోక్షంగా పొలిటికల్ ఎంట్రీ సూచనలు చేస్తూ మాట్లాడడమే!

ఎప్పటినుంచో తమిళనాట హీరోలు పొలిటికల్ గేమ్‌లోకి వచ్చేముందు ఫ్యాన్స్ క్లబ్‌లను బలోపేతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి:

  • పీపుల్ మేడ్ స్టార్‌ను: “నేను కేవలం మీ వల్ల ఈ స్థాయికి వచ్చిన ‘పీపుల్ మేడ్ స్టార్‌‌’ని. మన లక్ష్యం ఏంటనే దానిపై నాతో పాటు మీకూ పూర్తి క్లారిటీ ఉండాలి” అని వ్యాఖ్యానించడం ద్వారా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను పరోక్షంగా బయటపెట్టారు.

  • విమర్శకులపై విరుచుకుపడ్డ హీరో: “విమర్శించే వాళ్లు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు. వారిని అస్సలు పట్టించుకోవద్దు.. మనం ప్రేమతో కలిసి ముందుకు సాగుదాం” అంటూ తన కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.

  • యూత్‌‌కు మెసేజ్: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ సోషల్ మీడియా నెగెటివిటీకి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తమిళనాడులో సినీ రాజకీయం!

ఇటీవలే తమిళ స్టార్ హీరోలు ధనుష్ (Dhanush), విశాల్ (Vishal) కూడా తమ ఫ్యాన్స్ అసోసియేషన్లతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజాసేవలోకి రావాలని పిలుపునివ్వడం, మరోవైపు లారెన్స్ ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమని ప్రకటించడం చూస్తుంటే.. కోలీవుడ్ నుంచి మరికొందరు స్టార్ హీరోలు త్వరలోనే విజయ్ బాటలో పొలిటికల్ పార్టీలు పెడతారా అనే చర్చ ఊపందుకుంది!

శివకార్తికేయన్ వేసిన ఈ అడుగు తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతుందో వేచి చూడాలి.

Keerthi