నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ప్యారడైజ్. ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన దసరా సూపర్ హిట్టుగా నిలిచింది. సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పారడైజ్ చిత్రంలో మోహన్ బాబు, సోనాలి కులకర్ణి తదితర భారీ తారాగణం నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నానాన్యిఈఈ. అయితే మొదట ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా.. బెటర్ అవుట్ పుట్ కోసం మేకర్స్ దీనిని ఆగస్టు 21కి వాయిదా వేశారు.
అయితే ఈ తేదీన కూడా నాని ప్యారడైజ్ వచ్చేలా లేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఆగస్టు 21కి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నాయి. అయితే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల అక్టోబర్ లేదా డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత ఆలస్యమైతే 2027 సంక్రాంతి బరిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది. దీంతో ఈ వార్తలతో నాని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక నాని తన నెక్ట్స్ ఫిల్మ్ బ్లడీ రోమియోను జూన్ నెలలో ప్రారభించనున్నారు. అయితే పారడైజ్ పనులను పూర్తి చేస్తేనే… నెక్ట్స్ మూవీ స్టార్ చేయనున్నారు.
