Find Articles

వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ఇన్సైడ్ రిపోర్ట్ లీక్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాల డైరెక్టర్ మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 36 నిమిషాల పర్ఫెక్ట్ రన్‌టైమ్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, తాజాగా బయటకు వచ్చిన ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాకు అన్ని వైపులా నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ద్విపాత్రాభినయంలో వరుణ్ మేనియా!

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన జీవించిన తీరు, ఒక క్యారెక్టర్ నుంచి మరో క్యారెక్టర్‌కు చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఇండస్ట్రీ టాక్. వరుణ్ నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది.

మేర్లపాక గాంధీ మార్క్ కామెడీ అండ్ స్క్రీన్‌ప్లే!

దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన శైలిలో వినోదాత్మక రచన, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను మెప్పించబోతున్నారు. ముఖ్యంగా థియేటర్లలో నవ్వుల పూలు పూయించేందుకు వరుణ్ తేజ్ – కామెడీ స్టార్ సత్య కాంబినేషన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రతీ సన్నివేశం థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని సమాచారం.

సాంకేతిక నైపుణ్యం.. తమన్ క్రేజీ BGM!

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.  పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్, ప్రాపర్ టైమింగ్‌తో కూడిన లైన్స్ సినిమాకు ప్లస్ కాగా, అత్యుత్తమ ఛాయాగ్రహణం (Cinematography) విజువల్ రిచ్‌నెస్‌ను అందించింది.

పర్‌ఫెక్ట్ ఎమోషన్స్ & హీరోయిన్ క్యారెక్టర్!

కథలో హీరోయిన్ రితికా నాయక్‌కి చాలా ప్రాధాన్యత ఉన్న పవర్‌ఫుల్ పాత్ర లభించింది. ఆమె తన నటనతో మెప్పించినట్లు తెలుస్తోంది. కేవలం వినోదమే కాకుండా, కథలో అంతర్లీనంగా సాగే హృదయానికి హత్తుకునే ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తాయని సమాచారం.

మొత్తానికి ఇన్సైడ్ టాక్ ఆధారంగా ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద పక్కా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది!

Keerthi