Find Articles

ఎన్టీఆర్ వద్దనుకున్న సినిమా.. రామ్ చరణ్ కెరీర్‌కు మరో బ్లాక్‌బస్టర్!

సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లు కుదరడం వెనుక ఆసక్తికరమైన కథలు ఉంటాయి. తాజాగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పెద్ది’ సినిమా విషయంలో కూడా అలాంటి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.  పెద్ది సినిమా కథ మొదట జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందని, కానీ కొన్ని కారణాల వల్ల అది రామ్ చరణ్‌కు చేరిందనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?
నిజానికి బుచ్చిబాబు సానా ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కోసం సిద్ధం చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో, దర్శకుడు రామ్ చరణ్‌ను సంప్రదించారు. కథ విన్న వెంటనే రామ్ చరణ్ దానికి ఒకే చెప్పడం, ఆ తర్వాత సినిమా భారీ విజయాన్ని అందుకోవడం చకచకా జరిగిపోయాయి. ఒక సింగిల్ సిట్టింగ్‌లోనే రామ్ చరణ్ ఈ సినిమాను ఓకే చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఎన్టీఆర్‌కు ‘కాస్ట్‌లీ మిస్’?
‘పెద్ది’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకోవడం ఆయన కెరీర్‌లో ఒక ‘కాస్ట్‌లీ మిస్’ అని చెప్పవచ్చా? అంటూ ఫ్యాన్స్ మధ్య చర్చ జరుగుతోంది. అయితే, ఒక హీరో వద్దనుకున్న కథ మరొక హీరో వద్దకు వెళ్లి బ్లాక్‌బస్టర్ కావడం అనేది చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. ఆ కథ రామ్ చరణ్ జాతకంలో ఉండబట్టే ఆ చిత్రం ఆయన వద్దకు వచ్చిందని కొందరు అభిప్రాయపడుతుంటే, ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే ఇంకోలా ఉండేదని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, ‘పెద్ది’ సక్సెస్ మాత్రం రామ్ చరణ్ కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

Keerthi