ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల షేర్ చేసిన ఒక ఇంటెన్సివ్ అండ్ బ్యూటిఫుల్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.
అందమైన ఫోటో.. మనసును తాకే సందేశం!
పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఒక క్యూట్, క్యాండిడ్ ఫోటోను పంచుకుంటూ అన్నా కొణిదెల తన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “ఈ రోజు మిమ్మల్ని మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, ఆలోచనల్లో, ప్రార్థనల్లో ఉన్నారు. మీరు ఇతరుల జీవితాలను ఎంతగా స్పృశించారో, సమాజానికి ఎంతగా సేవ చేశారో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. జన్మదిన శుభాకాంక్షలు!” అంటూ ఆమె రాసుకొచ్చిన ప్రేమపూర్వక వ్యాఖ్యలు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.
నెట్టింట హల్చల్ చేస్తున్న వైరల్ పిక్!
అన్నా కొణిదెల రాసిన ఈ మెసేజ్ పవన్ కళ్యాణ్‌పై ఆమెకున్న అపారమైన అనురాగాన్ని చాటిచెప్పడమే కాకుండా, ప్రజా నాయకుడిగా ఆయన సంపాదించుకున్న అపారమైన గౌరవాన్ని, ప్రజల అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ రేర్ ఫోటో, ఎమోషనల్ క్యాప్షన్ పవర్ స్టార్ బర్త్‌డే వేడుకలకు మరింత ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
https://www.instagram.com/p/DcwVciszY45/?utm_source=ig_web_button_share_sheet