Find Articles

తేజ సజ్జా పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరో తెలుసా?

‘హనుమాన్’ చిత్రంతో పాన్-ఇండియా రేంజ్‌లో సంచలన విజయం సాధించి, టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా మారిన యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు గుప్పుమన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ప్రచారంలో ఉన్న వార్తలపై తేజ సజ్జా స్వయంగా స్పందిస్తూ, తన పెళ్లి మేటర్ పై అధికారిక ప్రకటన చేశారు.

రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్:  

ఈ పెళ్లి వార్తలకు సంబంధించి సినీ ప్రియులు, అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని, సంచలనాన్ని రేకెత్తిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే.. ఆమె సినిమా రంగానికి ఏమాత్రం సంబంధం లేని బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడం ఆమె పూర్తి వివరాలు, పేరును తేజ సజ్జా ఇంకా సస్పెన్స్‌లోనే ఉంచడమే!

తన పెళ్లి ఏర్పాట్లకు సంబంధించి తేజ సజ్జా వెల్లడించిన ముఖ్యమైన విశేషాలు:

కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం: “అమ్మాయికి చలనచిత్ర పరిశ్రమతో ఎలాంటి కనెక్షన్ లేదు. వారిది బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆమె యూఎస్‌ (US)లో పెరిగారు. ఇది పూర్తిగా మా తల్లిదండ్రులు కుదిర్చిన పెద్దల వివాహం” అని తేజ తెలిపారు.

నవంబర్‌లో నిశ్చితార్థం.. డిసెంబర్‌లో పెళ్లి: వచ్చే నవంబర్ నెలలో అత్యంత వైభవంగా ఎంగేజ్‌మెంట్ జరగనుండగా, డిసెంబర్ నెలలో రాజస్థాన్‌లో అత్యంత విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నారు.

ప్రైవేట్ వేడుక: కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది ప్రాణస్నేహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

సస్పెన్స్‌లోనే అమ్మాయి పేరు!

అత్యంత వైభవంగా రాజస్థాన్‌లో రాయల్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించినప్పటికీ, తనకు కాబోయే భార్య పేరును మాత్రం తేజ సజ్జా ప్రస్తుతం సస్పెన్స్‌లోనే ఉంచారు. దీంతో ఆ లక్కీ గర్ల్ ఎవరు? అనే ఉత్కంఠ నెట్టింట బాగా పెరుగుతోంది. యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి వార్తతో అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు!

Keerthi