Find Articles

ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’.. ఆలస్యమవుతున్నా తగ్గని క్రేజ్!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సీక్వెల్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు చిత్రాల సీక్వెల్స్‌పైనే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ కోవలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ లో “జై హనుమాన్” (Jai Hanuman) కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా వచ్చిన మొదటి భాగం ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆ చిత్రం యువ దర్శకుడు ప్రశాంత్ వర్మను టాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల సరసన నిలబెట్టింది.

అంజనాద్రిలో పూజా కార్యక్రమాలు పూర్తి..

యువ హీరో తేజ సజ్జతో పాటు కన్నడ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి (Rishab Shetty) లీడ్ రోల్‌లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. అయితే, మొదటి భాగం విడుదలైన సమయంలోనే పార్ట్ 2 ని 2025లో తీసుకొస్తామని ప్రశాంత్ వర్మ ప్రామిస్ చేశారు. కానీ, 2026 సగం పూర్తవుతున్నప్పటికీ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పెద్దగా అప్‌డేట్స్ ఏవీ బయటకు రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. నిజానికి, ఈ ఏడాది ఫిబ్రవరి 22నే కర్ణాటకలోని అంజనాద్రి బెట్టలో చిత్ర బృందం సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ పనులను కూడా లైన్‌లోకి తెచ్చింది.

ఆఫ్‌లైన్‌లో పదిలంగానే క్రేజ్.. క్లారిటీ కావాలంటున్న ఫ్యాన్స్!

ఆన్‌లైన్‌లో లేదా సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి లేకపోయినప్పటికీ.. గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ‘జై హనుమాన్’ చిత్రంపై ఉన్న బజ్ కొంచెం కూడా తగ్గలేదు. లార్జ్ స్కేల్ యాక్షన్ అండ్ మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరూ క్లారిటీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో కేవలం హనుమంతుడి భక్తుడి చుట్టూ కథ తిరగ్గా.. ఈ పార్ట్ 2 లో నేరుగా భగవాన్ హనుమంతుడి పాత్రలోనే రిషబ్ శెట్టి కనిపించబోతుండటం విశేషం. ఆఫ్‌లైన్‌లో ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ పదిలంగానే ఉంది కాబట్టి.. మేకర్స్ ఇప్పటికైనా సరైన అఫీషియల్ అప్‌డేట్ లేదా రిలీజ్ విండోపై ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Keerthi