Find Articles

సైలెంట్‌గా ఓటీటీలోకి కాజల్ ‘ది ఇండియా స్టోరీ’!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (The India Story: Slow Poison in Progress). చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ బహుభాషా చిత్రంలో కాజల్ అడ్వకేట్ అర్చన పాత్రలో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. ప్రముఖ నటులు శ్రేయాస్ తల్పడే, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత జులై 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

సెన్సార్‌నే కదిలించిన సంచలన కథాంశం!

ఈ సినిమా చుట్టూ అసలు వివాదం మరియు చర్చనీయాంశంగా మారిన బిగ్ పాయింట్ ఏమిటంటే.. దేశంలో పెస్టిసైడ్ కంపెనీల దోపిడీ, పంటల్లో వాడే ప్రమాదకర రసాయనాలు, మరియు వాటివల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ఎలా బలిపోతున్నాయి అనే అత్యంత సున్నితమైన అంశాలను నిర్భయంగా వెండితెరపై ఎండగట్టడం! బడా కార్పొరేట్ కంపెనీల అక్రమాలను ప్రశ్నించే కోర్ట్‌రూమ్ సీన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆలోచింపజేశాయి.

సైలెంట్‌గా తెలుగు, తమిళ వెర్షన్లు స్ట్రీమింగ్

ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ వేదిక జియో హాట్‌‌స్టార్ (Jio Hotstar), సెప్టెంబర్ 18 నుంచి కేవలం హిందీ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. దీంతో సౌత్ ఆడియెన్స్, కాజల్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

అయితే, ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్‌గా జియో హాట్‌స్టార్ ఈ రోజు నుంచి తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌లోకి తీసుకువచ్చి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ సడెన్ డిజిటల్ రిలీజ్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయినవారు ఈ పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామాను ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు!

Keerthi