Find Articles

నేషనల్ అవార్డులలో ‘కల్కి’ హవా

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) జాతీయ వేదికపై తన సత్తా చాటింది. గుజరాత్‌లో ఘనంగా జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త మైలురాయిగా నిలిచిన ఈ సినిమాకు జాతీయ స్థాయిలో దక్కిన ఈ గౌరవంతో అటు వైజయంతీ మూవీస్ వర్గాలు, ఇటు ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

రెండు విభాగాల్లో ‘కల్కి’ రచ్చ!

భారీ కాన్వాస్‌పై, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ క్రింది రెండు విభాగాల్లో జాతీయ పురస్కారాలను ముద్దాడింది:

  1. బెస్ట్ పాపులర్ ఫిల్మ్: సమగ్ర వినోదాన్ని అందించిన అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) ‘కల్కి 2898 ఏడీ’ జాతీయ అవార్డును కైవసం చేసుకుంది.

  2. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఈ సినిమా కోసం అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ కాశీ, శంభాల ప్రపంచాన్ని సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ జాతీయ అవార్డు దక్కింది.

నాగ్ అశ్విన్, అశ్వినీదత్ టీమ్‌కు గౌరవం!

ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవంలో చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin), లెజెండరీ నిర్మాతలు సి. అశ్వినీదత్, స్వప్నదత్ స్వయంగా పాల్గొని భారత గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందుకని జాతీయ వేదికపై మెరిశారు.

దర్శకుడు నాగ్ అశ్విన్ తన వినూత్న విజన్‌తో క్రియేట్ చేసిన కాలక్రమ ప్రయాణం, ప్రొడక్షన్ డిజైన్, టెక్నికల్ ఎక్సలెన్స్ మరియు నటీనటుల అద్భుత నటనకు ఈ జాతీయ అవార్డులే నిదర్శనంగా నిలిచాయి.

వైజయంతీ మూవీస్ ప్రయాణంలో మరో స్వర్ణ అధ్యాయం!

దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న వైజయంతీ మూవీస్ బ్యానర్‌కు ఈ గుర్తింపు దక్కడం మరో గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ పురస్కారాలు అందుకున్న ఈ రేర్ అండ్ స్పెషల్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Keerthi