Find Articles

నాని రొమాంటిక్ అవతార్… ‘ది ప్యారడైజ్’ నుంచి ‘అంజానా అంజానీ’ సాంగ్ అవుట్

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శరవేగంగా సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన మాస్ అండ్ పవర్ ఫుల్ బీట్స్ చార్ట్‌బస్టర్లుగా నిలవగా, తాజాగా మేకర్స్ ప్రేక్షకుల కోసం ఒక క్యూట్ అండ్ సోల్‌ఫుల్ రొమాంటిక్ లవ్ ట్రాక్‌ను మైదానంలోకి వదిలారు.

అనిరుధ్ మ్యాజిక్.. ‘అంజానా అంజానీ’ మెలోడీ ట్రీట్!

ఈ సినిమాకి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, తాజాగా విడుదలైన ‘అంజానా అంజానీ’ (Anjaana Anjaani) పాట మ్యూజిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ లిరిసిస్ట్ కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు ఎంతో ఆకర్షణీయమైన, అర్ధవంతమైన సాహిత్యాన్ని అందించగా.. అనిరుధ్ రవిచందర్ మరియు సుబ్లాషిణి కలసి ఈ పాటను ఆలపించారు.

అనిరుధ్ మార్క్ ట్యూన్స్, సుబ్లాషిణి మ్యాజికల్ వాయిస్ కలగలిపి ఈ రొమాంటిక్ మెలోడీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. స్క్రీన్‌పై నాని, కయాదు లోహర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

బాక్సాఫీస్ విధ్వంసానికి సిద్ధం!

ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్‌తో సిద్ధమైన ఈ చిత్రం, నిడివి మరియు యాక్షన్ కంటెంట్‌తో థియేటర్లలో తుఫాన్ సృష్టించేందుకు రెడీ అయ్యింది. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ తర్వాత వస్తున్న ఈ పీరియాడిక్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చారిత్రాత్మక రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి!

Keerthi