Find Articles

డాన్స్‌తో స్టేజ్‌పై రచ్చ లేపిన ‘ప్యారడైజ్’ విలన్

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ భారీ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, తనదైన మార్క్ ఎనర్జీతో స్టేజ్‌పై రచ్చ లేపారు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ (Raghav Juyal).

‘ఆయా షేర్’ స్టెప్పులు.. సుమ కొంగు పట్టుకుని డాన్స్!

ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై రాఘవ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముందుగా ‘ఆయా షేర్’ పాటకు తనదైన శైలిలో ఫన్నీ స్టెప్పులేస్తూ ప్రేక్షకుల్లో జోష్ నింపిన ఆయన, ఆ తర్వాత స్టార్ యాంకర్ సుమ చీర కొంగు పట్టుకుని ‘యేష నాగుల’ సాంగ్‌కు వేసిన ఊరమాస్ డాన్స్ ఈవెంట్‌కే ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

రాఘవ్ చేసిన ఈ సరదా హంగామాకు ఆడిటోరియమంతా ఈలలు, కేకలతో హోరెత్తిపోయింది. ప్రస్తుతం ఈ ఫన్నీ అండ్ ఎనర్జెటిక్ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

‘కిల్’ మూవీ నుంచి ‘ప్యారడైజ్’ వరకు!

పక్కా డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాఘవ్ జుయాల్, బాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన ‘కిల్’ (Kill) మూవీలో తనదైన విలనిజంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో ఆయన నటనకు సౌత్ ఇండస్ట్రీ కూడా ఫిదా అయింది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నానికి సరిజోడైన విలన్‌గా ఏ స్థాయిలో మెప్పించబోతున్నారోనని నాని అభిమానులు, సినీ ప్రియులు తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Keerthi