తమిళ చిత్రసీమలో తిరుగులేని మాస్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించే ‘దళపతి’ విజయ్ వారసుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) త్వరలోనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిగ్మా’ (Sigma) అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జాసన్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.