Find Articles

మరోసారి హాట్ టాపిక్‌గా మారిన యశ్ టాక్సిక్!

రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’ (Toxic). ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యభరితమైన కథాంశంతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ విజువల్ వండర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతోంది. ఈ భారీ యాక్షన్ డ్రామాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్ చేశారు.

నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘మనసాగదే’ సాంగ్!
సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన చిత్రబృందం, తాజాగా ‘మనసాగదే..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. తనిష్ బాగ్చీ, అర్ల్సాన్ నిజామి, ఫహీమ్ అబ్దుల్లా కలిసి అందించిన మెలోడియస్ స్వరాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం భావపూర్వకంగా ఉండగా, సిద్ధార్థ్ బస్రూర్ తన అద్భుతమైన గొంతుతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. సాంగ్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

భారీ స్టార్ కాస్టింగ్‌తో గీతూ మోహన్ దాస్ మేజిక్!
ఈ సినిమాలో యశ్ సరసన బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కథానాయికలు నటిస్తుండటం విశేషం. నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ వంటి విలక్షణమైన నటీనటులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని అత్యంత స్టైలిష్ అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.

ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ ‘టాక్సిక్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!

Keerthi