వైవిధ్యమైన కథలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తన ‘పవర్’ చూపించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పవర్‌పేట’. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే సందీప్ కెరీర్‌లోనే ఇది ఒక భారీ మాస్ పీరియాడిక్ మూవీ కాబోతుందని స్పష్టమవుతోంది.
గ్లింప్స్ ప్రారంభమే ఒక థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాను తలపిస్తోంది. అభిమానుల ఈలలు, కేకల మధ్య సందీప్ కిషన్ ఎంట్రీ అదిరిపోయింది. చేతిలో సిగరెట్, కళ్ళలో ఆవేశం, నోట సింహం గురించి చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆ నేల స్వభావం గురించి చెబుతూనే, తన పాత్రలోని గాంభీర్యాన్ని సందీప్ అద్భుతంగా పండించారు. స్క్రీన్‌పై బాణాసంచా విసిరే సీన్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ ‘సేనాపతి రవి’ అనే ఇంటెన్స్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. గడ్డం, మీసాలతో రగ్గ్డ్ పీరియాడిక్ లుక్‌లో సందీప్ షాకింగ్ మేకోవర్ ఇచ్చారు. కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, స్టైలిష్ షేడ్స్‌తో ఆ కాలం నాటి డాన్ లాంటి అటిట్యూడ్ కనిపిస్తోంది. తన డైలాగ్ డెలివరీలో కొత్త బేస్ చూపిస్తూ, కేవలం ఒక సిగరెట్ వెలిగించే సీన్‌తోనే ఆ క్యారెక్టర్‌లో ఎంత ఆవేశం ఉందో చూపించారు.
దర్శకుడు కృష్ణ చైతన్య ఒక రచయితగా ఈ చిత్రానికి ఎంతటి బలమైన డైలాగ్స్ అందించారో గ్లింప్స్ వింటే అర్థమవుతోంది. 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌కు ప్రాణం పోశారు. ప్రతి ఫ్రేమ్‌ను తన సంగీతంతో ఎలివేట్ చేశారు. మధీ విజువల్స్ పీరియాడిక్ సెటప్‌ను రిచ్‌గా చూపిస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టడం సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్.
ప్రస్తుతం ‘పవర్‌పేట’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, తదుపరి షెడ్యూల్స్ కోసం సిద్ధమవుతోంది. రామకృష్ణ-మోనికల ప్రొడక్షన్ డిజైన్, సచిన్ సుధాకరన్ అద్భుతమైన సౌండ్ డిజైన్ సినిమాకు కొత్త టెక్స్చర్‌ను తీసుకురాబోతున్నాయి.
మొత్తానికి ‘సేనాపతి రవి’గా సందీప్ కిషన్ చేస్తున్న ఈ మాస్ అటాక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పీరియాడిక్ డ్రామాను ఇష్టపడే మాస్ ఆడియన్స్‌కు ‘పవర్‌పేట’ ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా కాబోతుందని అర్థమవుతోంది!