Find Articles

గ్లామర్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్: ఫిల్మ్ నగర్‌లో గ్రాండ్‌గా ‘ఎయిర్-ఎ-లక్స్’ బ్యూటీ సెలూన్

హైదరాబాద్‌లోని గ్లామర్ హబ్ అయిన ఫిల్మ్ నగర్‌లో మరో లగ్జరీ బ్యూటీ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక హంగులు, విశేష సదుపాయాలతో ఏర్పాటు చేసిన “ఎయిర్-ఎ-లక్స్” (Air-a-Luxe) హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అంగరంగ వైభవంగా ప్రారంభించారు.

ఈ ప్రతిష్టాత్మక సెలూన్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. వారిలో ప్రధానంగా: ఎస్.కె. గుప్తా (ఐఆర్ఎస్ అధికారి), రమేష్ పుప్పాల (ప్రముఖ సినీ నిర్మాత), మహ్మద్ జుబేద్ బాషా** (బీఆర్ఎస్ నేత),ప్రవీణ** (సినీ నటి), సాకేత్ అగర్వాల్** (ప్రముఖ బిల్డర్) వంటి వారంతా ఈ కార్యక్రమానికి హాజరై ‘ఎయిర్-ఎ-లక్స్’ యాజమాన్యానికి తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా సెలూన్ యజమానురాలు నందిని మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “గ్లామర్ ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ అయిన ఫిల్మ్ నగర్‌లో మా సెలూన్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. బ్యూటీషియన్ రంగంలో నాకున్న 15 ఏళ్ల అపార అనుభవంతో, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెయిర్, స్కిన్ కేర్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించడమే మా ప్రధాన లక్ష్యం” అని ఆమె స్పష్టం చేశారు.

Keerthi