సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. అది ‘దళపతి’ విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం గురించే. వీరిద్దరి మధ్య కేవలం స్నేహమే ఉందా లేక అంతకు మించి ఏమైనా ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. తాజాగా త్రిష చేసిన ఒక పోస్ట్ ఆ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి, తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ కార్యకర్తల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘట్టం వేళ విజయ్ ధరించిన దుస్తులు, ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా త్రిష కూడా ఆ వేడుకలో సందడి చేసిన సంగతి తెలిసిందే. శారీలో వచ్చి… అక్కడి జనాలను ఆకట్టుకుంది. త్రిష ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. విజయ్ ప్రమాణ స్వీకారం వేల ధరించిన శారీలో ఫోటోలకు ఫోజులిస్తూ… “Love is always louder” (ప్రేమ ఎప్పుడూ శబ్దానికంటే బలంగా వినిపిస్తుంది) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? వెంటనే విజయ్ రాజకీయ అరంగేట్రంపై త్రిష తనదైన శైలిలో స్పందించిందని, ఆయనకు పరోక్షంగా శుభాకాంక్షలు తెలుపుతూనే తన మనసులోని మాటను బయటపెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు. “లవ్ ఈజ్ లౌడర్” అని త్రిష పేర్కొనడం విజయ్‌పై ఆమెకున్న అభిమానాన్నా? లేక వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుందా? అని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం విజయ్-త్రిషల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో ‘లియో’ సినిమా సమయంలో కూడా వీరిద్దరి చుట్టూ అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో త్రిష చేసిన ఈ “క్రేజీ” పోస్ట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై దళపతి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.