Find Articles

‘సుధీర్ జోకర్’గా ఊరమాస్ ఎంట్రీ.. ఫస్ట్‌ లుక్‌ అదిరిందిగా!

బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుడిగాలి సుధీర్ సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. రేపు సుధీర్ పుట్టినరోజును పురస్కరించుకుని, అభిమానులకు ఒకరోజు ముందే మేకర్స్ అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. సుధీర్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన క్రేజీ టైటిల్‌తో పాటు ఇంట్రెస్టింగ్ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘సుధీర్ జోకర్’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో ప్లేయింగ్ కార్డ్స్ (పేకాట ముక్కలు) మధ్యలో సుడిగాలి సుధీర్ కనిపిస్తున్న లుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుధీర్ స్టైలిష్ అండ్ డిఫరెంట్ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇక్కడితోనే ఆగడం లేదు. రేపు సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే ‘బ్యాంగర్’ రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు, రేపు సుధీర్ నేరుగా తన అభిమానులతో ముఖాముఖి ఇంటరాక్షన్ కాబోతుండటం విశేషం. దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బిగ్ బాస్ ఫేమ్ అయేషా హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం కాబోతోంది. సుధీర్, అయేషాలతో పాటు ఈ చిత్రంలో సీనియర్ నటి అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ వంటి భారీ తారాగణం ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పీఎస్ సునీల్ పుప్పాల స్క్రిప్ట్ అందిస్తూ డైరెక్ట్ చేస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ తన మార్క్ ట్యూన్స్‌తో అలరించనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ‘సుధీర్ జోకర్’ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

Keerthi