Find Articles

‘పెద్ది’ సెన్సార్ టాక్: జాన్వీ బోల్డ్ డైలాగ్స్‌పై సెన్సార్ కట్.. రన్ టైమ్ ఎంతంటే!

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా, తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే, ఈ సినిమా రన్‌టైమ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 3 గంటల 3 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ప్రస్తుత కాలంలో కమర్షియల్ సినిమాలకు మూడు గంటల నిడివి అంటే రిస్క్‌తో కూడుకున్నదే అయినా, బుచ్చిబాబు మేకింగ్ ఆ లోటును భర్తీ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, సినిమాలో జాన్వీ పలికిన కొన్ని బోల్డ్ డైలాగ్స్ పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సినిమాలోని తీవ్రతను, పాత్ర చిత్రణను దృష్టిలో ఉంచుకుని సెన్సార్ అధికారులు ఆ డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని ఆదేశించారట. ఇప్పుడు ఈ విషయంపైనే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, రామ్ చరణ్ మాస్ లుక్ సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘పెద్ది’, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ ‘పెద్ది’ ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో చూడాలి.

Keerthi