Find Articles

నాకు ఏ సర్జరీ జరగలేదు.. బిగ్ బీ అమితాబ్ షాకింగ్ క్లారిటీ!

బాలీవుడ్ లెజెండ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (83) శస్త్రచికిత్స పొంది ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. తన ఆరోగ్యంపై వైరల్ అవుతున్న రూమర్లపై అమితాబ్ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తనకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేయడంతో ఆయన కోట్లాది మంది అభిమానులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది? ఐసీయూ కామెంట్స్ వెనుక అసలు కథ!

ఇటీవల అమితాబ్ తన ఎక్స్ (ట్విట్టర్) మరియు వ్యక్తిగత బ్లాగ్‌లో రాసుకొచ్చిన పోస్ట్ నెట్టింట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘సర్జరీ తర్వాత ఐసీయూ నుంచి ఇంటికి తిరిగొచ్చాక కోలుకోవడం శారీరకంగా, మానసికంగా కష్టమైన దశ’ అని పేర్కొనడంతో ఆయనకు ఏదో పెద్ద శస్త్రచికిత్స జరిగిందని అందరూ కంగారు పడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలపై అమితాబ్ స్పందిస్తూ.. “నా పోస్ట్‌ను జనాలు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదు, నేను పూర్తి క్షేమంగా ఉన్నాను. ఇటీవల జరిగిన అర్జెంటీనా – స్పెయిన్ ఫిఫా మ్యాచ్ ఫలితాన్ని మనసులో ఉంచుకుని ఒక ఉదాహరణగా మాత్రమే ఆ మాటలన్నాను. ఓ ఛాంపియన్ జట్టు ఓడిపోయినప్పుడు తిరిగి పుంజుకోవడం ఎంత కష్టమో చెప్పడమే నా ఉద్దేశం. ఐసీయూ నుంచి రావడాన్ని కేవలం ఒక పోలికగా మాత్రమే వాడాను” అని వివరణ ఇచ్చారు.

కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ షూటింగ్‌కు రెడీ!
తన హెల్త్ కండిషన్‌పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన బిగ్ బీ, తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. రెగ్యులర్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న తాను త్వరలోనే పాన్-ఇండియా వండర్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ (Kalki 2) షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. 83 ఏళ్ల వయసులోనూ ఆయన చూపించే ఈ ఎనర్జీ, డెడికేషన్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Keerthi