గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాల విషయంలో స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించబడిన పెద్ది షూటింగ్ కంప్లీట్ చేసి తదుపరి సినిమా కోసం చరణ్ సిద్ధమవుతున్నారు. అయితే, అందరి దృష్టి ఇప్పుడు #RC17 పై పడింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతున్నట్లు కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సంగతి ఎలా ఉంచితే సుకుమార్ సినిమా తరువాత చేయబోయే సినిమా గురించి కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని తెలుస్తోంది. నాగవంశీ ఇప్పటికే చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే సరైన దర్శకుడి కోసం అన్వేషణ సాగుతోందని సమాచారం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఈ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ముఖ్యంగా కొంతమంది అభిమానులైతే అసలు ఇది అయ్యే పనేనా అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.