Find Articles

పదేళ్ల క్రితం చెప్పిన మాట త్రిష నిజం చేసేస్తుందిగా!

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే అటు కోలీవుడ్, ఇటు రాజకీయ వర్గాల్లో ఒకే పేరు మార్మోగిపోతోంది. ఆమె ఎవరో కాదు.. సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష కృష్ణన్. ఈరోజు త్రిష 43వ బర్త్ డే. అయితే త్రిష బర్త్ డే వేళ ఊహించని పరిణామాలు తమిళ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకే మెజార్టీ స్థానాల్లో దూసుకుపోతుంది. దాదాపు 50 ఏళ్ల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ ప్రభంజనం సృష్టిస్తున్నారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ గెలుపు సంబరాల్లో అనూహ్యంగా త్రిష పేరు తెరపైకి రావడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

త్రిష సరిగ్గా పదేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో తాను రాజకీయాల్లోకి వస్తే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు నెటిజన్లు ప్రస్తుత పరిస్థితులకు లింక్ చేస్తున్నారు. అప్పుడు అన్న మాట.. ఇప్పుడు నిజం చేసేసింది అంటూ మీమ్స్, పోస్ట్‌లతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య ఏదో ఉందనే వార్తలు ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తోడు… ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజునే త్రిష పుట్టినరోజు కావడం విశేషం. దీంతో నెటిజన్లు విజయ్ గెలుపుతో త్రిష సీఎం అయినట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే త్రిష ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం త్రిష విజయ్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో సంబరాలు చేసుకుంటున్నారు. మొత్తానికి, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలవుతున్న తరుణంలో త్రిష పాత వీడియోలు వైరల్ గా మారాయి.

Keerthi