Find Articles

ఒక్కటైన విజయ్-సంగీత దంపతులు.. మరి త్రిష పరిస్థితేంటి?

Vijay

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం ఊహించని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకులు, నివాస హక్కుల పిటిషన్‌ను సంగీత హఠాత్తుగా వెనక్కి తీసుకోవడంతో ఈ కేసును కోర్టు మూసివేసింది. ఈ పరిణామంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారనే వార్తలు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

నెట్టింట ‘త్రిష’ హాట్ టాపిక్!

ఈ దంపతుల వివాహ బంధం మళ్లీ నిలబడటంతో, సోషల్ మీడియా దృష్టి అంతా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ త్రిష వైపు మళ్లింది. కొద్దికాలంగా విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారంటూ, డేటింగ్‌లో మునిగితేలుతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వార్తలపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

అది కేవలం స్నేహమేనా?

త్రిష-విజయ్ జోడీకి వెండితెరపై ఉన్న క్రేజ్ దృష్ట్యానే వీరిపై రూమర్లు వచ్చాయని, వారిద్దరిదీ కేవలం మంచి స్నేహబంధం మాత్రమేనని దళపతి అభిమానులు వాదిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేసిన గ్యాసిప్స్‌కు ఈ విడాకుల పిటిషన్ ఉపసంహరణతో చెక్ పడిందని వారు అభిప్రాయపడుతున్నారు.

త్రిష తదుపరి అడుగు ఏంటి?

మరోవైపు ఈ ప్రచారాలన్నింటికీ దూరంగా ఉన్న త్రిష, రాబోయే రోజుల్లో తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తారా? లేదా పూర్తిగా సినిమాలకే పరిమితమవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, విజయ్ ఫ్యామిలీ మళ్లీ కలవడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Keerthi