Find Articles

తమన్ మాస్ సాంగ్‌కు మెగాస్టార్ స్టెప్పులు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సరికొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

స్పెషల్ సెట్‌లో మెగాస్టార్ గ్రేస్!

ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ నిన్నటివరకు హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో శరవేగంగా జరిగింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కంపోజ్ చేసిన ఒక అదిరిపోయే ఔట్ అండ్ ఔట్ మాస్ మసాలా నంబర్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు సమాచారం. ఈ మాస్ బీట్ సాంగ్ షూటింగ్‌ను మొదట పొల్లాచిలో కొంతమేర చిత్రీకరించగా, ఆ తర్వాత హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక భారీ స్పెషల్ సెట్‌లో రెండు రోజుల పాటు షూట్ చేసి నిన్నటితో ఈ సాంగ్ వర్క్‌ను పూర్తిగా కంప్లీట్ చేశారు.

ఈ పాటకి కొరియోగ్రఫీ అందించింది ఎవరనే దానిపై చిత్రబృందం ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ అయిన జానీ మాస్టర్ లేదా శేఖర్ మాస్టర్‌లలో ఒకరు ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసి ఉంటారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే షూటింగ్ బ్రేక్ సమయంలో చిరంజీవి వీరిద్దరితోనే లోకేషన్‌లో మాట్లాడటంతో ఈ ప్రచారం జోరందుకుంది. తమన్ ఇచ్చిన ఈ పవర్‌ఫుల్ మాస్ బీట్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని, విడుదలయ్యాక ఇదొక చార్ట్‌బస్టర్ సాంగ్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

టాప్ లీగ్‌లోకి కేవీఎన్ ప్రొడక్షన్స్?

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. అయితే, ఈసారి ఏకంగా ఒకవైపు మెగాస్టార్ చిరంజీవితో, మరోవైపు నందమూరి బాలకృష్ణతో భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టడంతో ఈ బ్యానర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ రెండు క్రేజీ సినిమాలు గనుక బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ హిట్ సాధిస్తే, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ టాలీవుడ్‌లోని టాప్ లీగ్ నిర్మాణ సంస్థల సరసన చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Keerthi