Find Articles

మళ్లీ వాయిదా పడ్డ నాని ‘ది ప్యారడైజ్’.. కొత్త డేట్ ఇదేనా?

నాచురల్ స్టార్ నాని, ఊరమాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’ (The Paradise). గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘దసరా’ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై లో ఉన్నాయి. అయితే, ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ షాకిచ్చినట్లు ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక వార్త జోరుగా ప్రచారమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

మూడోసారి మారిన విడుదల తేదీ!
నిజానికి ఈ సినిమాను మొదట 2026 మార్చిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఆగస్టులో కూడా ఈ సినిమా రావడం లేదట. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం, అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం తగిన సమయం లేకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విజువల్ వండర్‌ను ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో, దీని విడుదలను సెప్టెంబర్ 24కి పోస్ట్‌పోన్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్.

‘జడల్’గా నాని ఊరమాస్ అవతారం!
ఈ సినిమాలో నాని ‘జడల్’ (Jadal) అనే సరికొత్త ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నారు. దసరాను మించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నానికి జోడీగా కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సీనియర్ నటులు తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, ఈశ్వరీ రావు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో మెరవనున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మార్పుపై నెట్టింట ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Keerthi