టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల హైదరాబాద్‌ను తన ‘రెండో ఇల్లు’ అంటూ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో లవ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ ,పెళ్లిపై వచ్చిన ఆసక్తికరమైన ప్రశ్నలకు భాగ్యశ్రీ ఇచ్చిన హింట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
అఖిల్ జస్ట్ ఫ్రెండ్.. మరి ఆ ఒక్కరూ ఎవరు?
ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ భాగ్యశ్రీని లైన్ గా మూడు ఆప్షన్స్ ఇచ్చి ప్రశ్నించారు. “మీ లైఫ్‌లో ఫ్రెండ్షిప్, డేటింగ్, మ్యారేజ్.. ఈ మూడూ ఎవరితో?” అని అడగ్గా.. ఆమె చాలా తెలివిగా, నర్మగర్భంగా సమాధానం ఇచ్చింది. మొదట ఫ్రెండ్షిప్ గురించి చెప్తూ.. తనతో కలిసి నటించిన అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) తనకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది.
అయితే, ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చింది. డేటింగ్ , పెళ్లి ప్రస్తావన రాగానే.. భాగ్యశ్రీ ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ ఒక క్రేజీ హింట్ ఇచ్చింది. “నేను ఇప్పటివరకు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలందరిలో.. ప్రస్తుతం పెళ్లి కాకుండా బ్యాచిలర్‌గా ఉన్నది కేవలం ఒకే ఒక్కరు.. ఆ ఒక్కరితోనే నా ప్రయాణం” అంటూ నవ్వేసింది.
నెటిజన్ల గురి ఆ హీరో పైనే!
భాగ్యశ్రీ పేరు చెప్పకుండా ఇచ్చిన ఈ ఊహించని హింట్‌తో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ఫ్యాన్స్ లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ఆమె ఇప్పటివరకు నటించిన స్టార్స్ లో రవితేజ లాంటి వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇక అఖిల్ కేవలం ఫ్రెండ్ అని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మిగిలిన ఏకైక ఎనర్జిటిక్ స్టార్ ‘రామ్ పోతినేని’ (Ram Pothineni) మాత్రమేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. గత కొంతకాలంగా రామ్, భాగ్యశ్రీల మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్లకు, తాజా ఇంటర్వ్యూలో ఆమె సిగ్గుపడుతూ ఇచ్చిన హింట్ మరింత బలాన్ని చేకూర్చింది. మరి ఈ లవ్ స్టోరీపై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి!