Find Articles

నాని ‘ప్యారడైజ్’ సెకండాఫ్‌లో మైండ్ బ్లాకింగ్ సర్ప్రైజ్ క్యామియో!

మరో కొన్ని గంటల్లో తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద టైర్-1 స్టార్ హీరోల రేంజ్‌లో రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేస్తూ బాక్సాఫీస్ వేటను మొదలుపెట్టారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సెకండాఫ్‌లో ఆ స్టార్ హీరో సర్ప్రైజ్?: 

సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ వర్గాల్లో ఒక మైండ్ బ్లాకింగ్ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన తారాగణం కాకుండా, ఈ సినిమా సెకండాఫ్‌లో ఒక పాపులర్ స్టార్ నటుడు ఊహించని సర్ప్రైజ్ క్యామియో రోల్‌లో (Surprise Cameo) కనిపించబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

కథను మలుపు తిప్పే అత్యంత ఇంటెన్స్ సన్నివేశంలో ఈ గెస్ట్ అప్పీరియన్స్ ఉంటుందని, ఈ సర్ప్రైజ్ ఎంట్రీ థియేటర్లలో అభిమానులకు కనువిందు చేయడమే కాకుండా పూనకాలు తెప్పిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ నటుడు ఎవరు? ఆయన పాత్ర కథలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుంది? అనే సస్పెన్స్‌కు తెరపడాలంటే మాత్రం థియేటర్లో బొమ్మ పడేవరకు వేచి చూడాల్సిందే!

అనిరుద్ మ్యూజిక్ విధ్వంసం..  

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్ వి సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో, రాజీ పడని నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. రోక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన ఆర్‌ఆర్‌ (Background Score) అండ్ మాస్ ట్రాక్స్ ఈ సినిమాకు ప్రధాన అసెట్‌గా మారనున్నాయి.

సాలిడ్ క్యాస్టింగ్, రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఒక ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి!

Keerthi