Find Articles

నాని ‘ప్యారడైజ్’ విలన్ రాఘవ్ జుయాల్ మైండ్ బ్లాకింగ్ బ్యాక్‌గ్రౌండ్!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో, దానికి సరిసమానంగా విలన్ క్యారెక్టర్‌ను కూడా అంతే వైలెంట్‌గా డిజైన్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో నానికి రఫ్‌ అండ్ టఫ్‌గా పోటీ ఇచ్చే ప్రధాన ప్రతినాయకుడిగా (Main Villain) బాలీవుడ్ నటుడు, ‘కింగ్ ఆఫ్ స్లో మోషన్’ రాఘవ్ జుయాల్ (Raghav Juyal) టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.

రియాలిటీ షో కంటెస్టెంట్ నుంచి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్‌గా!

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జన్మించిన రాఘవ్ జుయాల్ జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. భారతదేశపు అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ ఇండియా డాన్స్’ (Dance India Dance) లో ఒక సాధారణ కంటెస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రాఘవ్, తనదైన సిగ్నేచర్ ‘స్లో మోషన్ డాన్స్’ శైలితో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ‘కింగ్ ఆఫ్ స్లో మోషన్’ గా ప్రసిద్ధి చెందారు.

ఆ తర్వాత పలు టీవీ రియాలిటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, తనదైన సమయస్ఫూర్తి, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

‘కిల్’ లో కిల్లర్ పర్ఫార్మెన్స్.. ఇప్పుడు నాని పై దాడి!

డాన్సర్‌గా, కమెడియన్‌గా నవ్విస్తూనే హిందీలో ‘ABCD 2’, ‘స్ట్రీట్ డాన్సర్ 3D’ వంటి హిట్ సినిమాల్లో నటించిన రాఘవ్, 2024 లో వచ్చిన మోస్ట్ వైలెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘కిల్’ (KILL) సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్‌ని షాక్‌కి గురిచేశారు. ఆ సినిమాలో ఆయన ప్రదర్శించిన క్రూరమైన, సైకోటిక్ విలనిజం సినీ విమర్శకులను సైతం మెప్పించింది.

ఇప్పుడు అదే నెగటివ్ ఇంటెన్సిటీతో ‘ది ప్యారడైజ్’ లో నానితో ఢీకొట్టబోతున్నారు. సాధారణంగా కామెడీ, డాన్స్‌తో అలరించే రాఘవ్, ‘ది ప్యారడైజ్’ లో అత్యంత భయంకరమైన విలన్‌గా రూపాంతరం చెందడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాని మాస్ ఎలివేషన్లకు, రాఘవ్ సైకోటిక్ విలనిజానికి మధ్య థియేటర్లలో ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చూడాలి!

Keerthi