Find Articles

రావణుడిగా యశ్ విశ్వరూపం… సీతా స్వయంవరంలో పవర్ ఫుల్ ఎంట్రీ!

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’. భారీ బడ్జెట్, హేమాహేమీలైన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రతి రోజూ ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వస్తూనే ఉంది. తాజాగా ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అత్యంత కీలకమైన ఘట్టాన్ని చిత్రీకరించినట్లు సమాచారం.

ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో మిథిలా నగర రాజభవాన్ని తలపించేలా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. విశాలమైన అంతఃపుర ప్రాంగణాలు, రాజభవన బాల్కనీలు, అద్భుతమైన రంగవల్లికలతో ఈ సెట్ కన్నుల పండువగా ఉందట. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ‘సీతా స్వయంవరం’ సీక్వెన్స్‌ను మేకర్స్ ఇటీవలే పూర్తి చేశారు. ఈ సినిమాలో లంకాధిపతి రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. స్వయంవరానికి రావణుడు వచ్చే సన్నివేశం ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

రావణుడిగా యశ్ సభలోకి అడుగుపెట్టే సీన్ ఎంతో పవర్‌ఫుల్‌గా, అక్కడ ఉన్న వాతావరణాన్నే మార్చేసేలా డిజైన్ చేశారట.

రావణుడు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యే ఘట్టం సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోంది. యశ్ తన పాత్రకు సరిపోయేలా అత్యంత గాంభీర్యంతో, డామినేటింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ సీన్లలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో సీతగా నటిస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి త్వరలోనే ఈ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్.. ఇలాంటి భారీ కాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

నితేష్ తివారీ ఎక్కడా రాజీ పడకుండా విజువల్ గ్రాండియర్‌తో ఈ పురాణ గాథను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ముఖ్యంగా రావణుడి కోణంలో ఈ సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. మరి వెండితెరపై యశ్ రావణుడిగా ఏ రేంజ్ లో గర్జిస్తారో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

Keerthi