Find Articles

పొరపాటున వేరే అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేశారా?

ఈ రోజుల్లో డిజిటల్ పేమెంట్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఒక్కోసారి అర్జెంట్‌గా డబ్బులు పంపే క్రమంలోనో లేదా అవతలి వారి మొబైల్ నంబర్ తప్పుగా ఎంటర్ చేయడం వల్లనో.. తెలియకుండానే వేరే వారికి డబ్బులు పంపేస్తుంటాం. ఇలా రాంగ్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు చాలామంది తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. కానీ, ఇకపై అలాంటి పొరపాట్లు జరిగితే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెంటనే అప్రమత్తమై కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ సొమ్మును సురక్షితంగా వెనక్కి రప్పించుకోవచ్చు.

ముందుగా ఈ పని అస్సలు మర్చిపోవద్దు!

మీరు పొరపాటున వేరే నంబర్‌కు డబ్బులు పంపినట్లు గుర్తించిన వెంటనే.. ఆ లావాదేవీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ (Transaction ID), తేదీ, సమయంతో కూడిన పూర్తి వివరాలను మొబైల్‌లో స్క్రీన్‌షాట్ తీసి భద్రపరుచుకోండి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మీరు వాడిన సంబంధిత యూపీఐ (UPI) యాప్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి జరిగిన పొరపాటుపై అధికారికంగా ఫిర్యాదు చేయాలి.

వివిధ డిజిటల్ యాప్స్ టోల్‌ఫ్రీ నంబర్లు ఇవే..

మీరు ఏ యాప్ ద్వారా మనీ సెండ్ చేశారో, దానికి సంబంధించిన కస్టమర్ కేర్ ప్రతినిధులను కింద పేర్కొన్న హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా వెంటనే కాంటాక్ట్ అవ్వొచ్చు:

  • గూగుల్ పే (Google Pay): 18004190157

  • ఫోన్ పే (PhonePe): 08068727374 లేదా 02268727374

  • భీమ్ యాప్ (BHIM): 18001201740

  • పేటీఎం (Paytm): 1204456456 (టోల్‌ఫ్రీ నంబర్)

యాప్స్ ద్వారా ఫలితం లేకపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీరు పైన పేర్కొన్న యాప్స్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి సానుకూల ఫలితం లభించకపోతే, మరో అద్భుతమైన మార్గం అందుబాటులో ఉంది. నేరుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అధికారిక వెబ్‌సైట్ అయిన npci.org.in ను సందర్శించి, అక్కడ ఆన్‌లైన్ ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. దీనివల్ల మీ డబ్బులు మీకు సురక్షితంగా తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు అధైర్యపడకుండా తక్షణమే స్పందించడం ముఖ్యం.

Keerthi