Find Articles

బాత్‌రూమ్‌లో ప్రమాదం.. 48 కుట్లు, 2 సర్జరీలు: అఖిల్ అక్కినేని

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) చాలా కాలం తర్వాత ‘లెనిన్’ (Lenin) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న అఖిల్.. తాను గత మూడేళ్లుగా వెండితెరకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో చెబుతూ తన జీవితంలో జరిగిన ఒక ఘోర ప్రమాదం గురించి బయటపెట్టారు.

చేతికి 48 కుట్లు.. నరకం చూశాను!
‘‘‘ఏజెంట్’ సినిమా విడుదలైన మూడు నెలల తర్వాత నేను బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కింద పడిపోయాను. అక్కడ ఉన్న గాజు ముక్కలు నా చేతిలోకి బలంగా గుచ్చుకున్నాయి. దాంతో ఎడమ చేతి వేళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో రెండుసార్లు శస్త్రచికిత్సలు (Surgeries) చేయాల్సి వచ్చింది. ఏకంగా 48 కుట్లు పడ్డాయి. ఆ ప్రమాదం వల్ల దాదాపు 8 నెలల పాటు కనీసం చిన్న బరువులు కూడా ఎత్తలేకపోయాను. ఆ గాయం నుంచి నేను శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకోవడానికే 16 నెలల సుదీర్ఘ సమయం పట్టింది. నేను మూడేళ్లు విరామం తీసుకోవడం వల్ల నా అభిమానులు నాపై చాలా కోపంగా ఉన్నారని తెలుసు. కానీ, నా పరిస్థితి అది. ఇకపై ఇలాంటి లాంగ్ గ్యాప్ రాదని నా ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేస్తున్నాను’’ అని అఖిల్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఇలాంటి పాయింట్‌తో ఇండియాలోనే సినిమా రాలేదు!
‘లెనిన్’ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణాన్ని అఖిల్ వివరిస్తూ.. “దర్శకుడు మురళీకిశోర్ ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు సరికొత్త అనుభూతి కలిగింది. ఇందులోని క్యారెక్టరైజేషన్లు, వాటి వెనుక ఉన్న విభిన్న కోణాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. టాలీవుడ్‌లోనే కాదు.. అసలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఈ పాయింట్‌ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ఇంతటి పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తోనే గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాను” అని నమ్మకంగా చెప్పారు.

భారతి పాత్ర చాలా పవర్‌ఫుల్: భాగ్యశ్రీ బోర్సే
ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయకిగా నటిస్తోంది. ఆమె తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ..

భాగ్యశ్రీ మాటల్లో: “ఈ చిత్రంలో నేను చేసిన ‘భారతి’ అనే పాత్ర చాలా బలంగా ఉంటుంది. సినిమాలో హీరో లెనిన్ ఏం చేసినా, ఎలాంటి అడుగులు వేసినా అది భారతి కోసమే అన్నట్లుగా సాగుతుంది. నటీనటుల్లోని అసలైన ప్రతిభను బయటకు తీసేందుకు ఇలాంటి ఇంటెన్స్ రోల్స్ చాలా అవసరం. నా కెరీర్ ఆరంభంలోనే ఇంతటి గొప్ప అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.”

అఖిల్ సరికొత్త మేకోవర్‌తో, ఎమోషనల్ కంటెంట్‌తో వస్తున్న ఈ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే జులై 10 వరకు వెయిట్ చేయాల్సిందే!

Keerthi