Find Articles

షూటింగ్ మొదలవ్వక ముందే గిన్నిస్ బుక్‌లోకి అల్లు అర్జున్ ‘రాకా’!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘రాకా’ (Raaka). అనౌన్స్‌మెంట్ నుంచే బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు టాలీవుడ్‌ను మాత్రమే కాకుండా ఆసియా సినిమా ఇండస్ట్రీని సైతం షాక్‌కి గురిచేసే సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది. భారతీయ సినిమా రంగాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతూ ఈ సినిమా ఏకంగా ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ (Guinness World Record) సొంతం చేసుకుంది.

37 మంది నటులతో రికార్డ్ ‘మోషన్ క్యాప్చర్’!

సినిమా నిర్మాణ రంగంలో సరికొత్త వండర్ క్రియేట్ చేస్తూ, ప్రపంచంలోనే తొలిసారిగా ఒకే ఫ్రేమ్‌లో ఏకంగా 37 మంది నటులపై ‘రియల్ టైమ్ మోషన్-క్యాప్చర్’ (Real-Time Motion-Capture) సాంకేతికతను నిర్వహించి ఈ అరుదైన మైలురాయిని మేకర్స్ అందుకున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది.

అఫీషియల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు స్వయంగా సెట్స్‌కు విచ్చేసి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీకి ఈ ప్రతిష్టాత్మక సర్టిఫికెట్‌ను అందించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

“ఇది కేవలం ఒక సినిమా రికార్డు మాత్రమే కాదు.. టెక్నికల్ వేల్యూస్‌లో ఇండియన్ సినిమా రేంజ్ ఏంటో గ్లోబల్ స్టేజ్‌పై చాటిచెప్పే సందర్భం!” అని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.+

Keerthi