విభిన్నమైన కథలను, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. మాధవన్. నంబి నారాయణన్ జీవిత కథతో ‘రాకెట్రీ’ ద్వారా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆయన, ఇప్పుడు మరొక భారతీయ విశిష్ట మహానాయకుడి స్పూర్తిదాయక ప్రయాణాన్ని వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఆ చిత్రమే ‘జి.డి.నాయుడు’ (GDN).
భారతీయ ఆవిష్కరణల మూలపురుషుడు
‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘కోయంబత్తూర్ వెల్త్ క్రియేటర్’, ‘మిరాకిల్ మేన్’ అని ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
సాంకేతిక రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలు చేస్తూ భారతీయ శ్రమకు అద్దం పట్టిన ఆయన వైవిధ్యాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నారు.
మాధవన్ అద్భుత మేకోవర్ – అగ్ర శ్రేణి నటీనటులు
జీడీ నాయుడు పాత్ర కోసం మాధవన్ తీసుకున్న గెటప్స్, మేకోవర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. విభిన్న వయస్సుల్లో ఆయన కనిపించే తీరు, సహజ సిద్ధమైన పీరియాడికల్ సెటప్ మరియు నిర్మాణ విలువలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి గోవింద్ వసంత అందించిన నేపధ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్ సినీ విమర్శకుల నుంచి, ప్రేక్షక దేవుళ్ల నుంచి విశేష ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల జాబితాలో నిలిచిన ఈ చిత్రం ఆగస్టు 7న గ్రాండ్గా థియేటర్లలోకి వస్తోంది.