గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). థియేటర్లలో సంచలన విజయం నమోదు చేసిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ సినిమా నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఓటీటీ వీక్షకులకు చిత్ర యూనిట్ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
థియేటర్లలో కట్ చేసిన సీన్స్ రీ-యాడ్.. ఫ్యాన్స్‌కు పండగే!
సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమానే ఓటీటీలో చూస్తుంటాం. కానీ ‘పెద్ది’ విషయంలో మేకర్స్ సరికొత్త ప్లాన్ చేశారు. థియేటర్ రన్‌టైమ్ (Run Time) ఎక్కువవుతుందనే కారణంతో ఎడిటింగ్‌లో కట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, అలాగే సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత తొలగించిన కొన్ని క్రేజీ సీన్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో ప్రత్యేకంగా యాడ్ చేశారు. దీంతో థియేటర్లలో మిస్ అయిన సరికొత్త కంటెంట్‌ను ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం దక్కడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సౌత్ భాషలన్నింటిలోనూ స్ట్రీమింగ్..
రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు టేకింగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ సరికొత్త వెర్షన్‌పై భారీగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ సరికొత్త సీన్స్‌తో సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే వారు వెంటనే నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ (Peddi OTT) పై ఒక లూక్ వేసేయండి!