Find Articles

కొత్తగా పెళ్లైన జంటలు ఎందుకు దూరంగా ఉండాలి? అసలు సీక్రెట్ ఇదే!

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వధూవరులను ఈ మాసంలో ఒకరికొకరు దూరంగా ఉంచుతారు. నూతన వధువును పుట్టింటికి పంపించే ఈ సాంప్రదాయం వెనుక కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, బలమైన సైంటిఫిక్, సామాజిక కారణాలు కూడా దాగున్నాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. మరి ఈ ఒక నెల రోజుల పాటు కొత్త జంటలు ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

వ్యవసాయ పనులకు ఆటంకం కలగకూడదనే..
పూర్వ కాలం నుండి మన దేశంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. తొలి వర్షాలు పడగానే రైతులు ఎంతో ఉత్సాహంతో పొలం పనులను ప్రారంభిస్తారు. అయితే, కొత్తగా పెళ్లైన జంటలు తమ భాగస్వామికే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల కీలకమైన వ్యవసాయ పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. అందుకే, యువత దృష్టి మరలకుండా, పనులన్నీ సజావుగా సాగాలనే ఉద్దేశంతో వధువును పుట్టింటికి పంపే ఆచారాన్ని తీసుకొచ్చారు.

తల్లీబిడ్డల ఆరోగ్యం కోసమే ఈ జాగ్రత్త!
ఈ ఆచారం వెనుక ఉన్న మరో ముఖ్యమైన సైంటిఫిక్ రీజన్ ఏంటంటే.. ఆషాఢ మాసంలో కొత్త జంటలు కలిసి ఉండి, ఒకవేళ భార్య గర్భం దాల్చితే (ప్రెగ్నెన్సీ వస్తే), సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అంటే మండు వేసవి కాలంలో (మార్చి, ఏప్రిల్, మే నెలల్లో) ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో ఉండే తీవ్రమైన ఎండలను, ఉక్కపోతను అప్పుడే పుట్టిన పసిబిడ్డతో పాటు బాలింత అయిన తల్లి కూడా తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది.

అందుకే తీవ్రమైన ఎండల తీవ్రత నుండి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, ఆషాఢంలో గర్భధారణ జరగకుండా ఉండేందుకే పెద్దలు ఈ నియమాన్ని పెట్టారు. కేవలం మూఢనమ్మకంలా కనిపించే ఈ ఆచారం వెనుక ఇంతటి ఆరోగ్య రహస్యం దాగి ఉండటం విశేషం.

Keerthi