Find Articles

ఎట్టకేలకు లైన్లోకి ఆ ‘డ్రీమ్ కాంబో’.. మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ అతనేనా?

తెలుగు చిత్రసీమను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తదుపరి ప్రాజెక్టులపై ఎప్పుడూ ఏదో ఒక హాట్ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ (వర్కింగ్ టైటిల్) అనే భారీ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు జక్కన్న. అయితే, ఈ సినిమా పట్టాలెక్కకముందే.. రాజమౌళి తర్వాత చేయబోయే ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ గురించిన ఒక ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్‌తో జక్కన్న క్రేజీ ప్రాజెక్ట్!
ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ దాదాపు లాక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుతో చేయబోయే సినిమా పూర్తయిన తర్వాతే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘మగధీర’ నాటి పాత బంధం.. ఎట్టకేలకు నిజం కానుందా?
నిజానికి రాజమౌళి, సూర్య కాంబినేషన్‌లో సినిమా రావడం ఇదేం మొదటి ప్రతిపాదన కాదు. గతంలో రామ్ చరణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ కథను రాజమౌళి మొదట సూర్య కోసమే సిద్ధం చేశారని, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని అప్పట్లో గట్టి ప్రచారం సాగింది. ఒకవేళ ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ తాజా వార్త కనుక నిజమైతే.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా అభిమానులు ఎదురుచూస్తున్న ఒక భారీ క్రేజీ కాంబో వెండితెరపై ఆవిష్కృతం కావడం ఖాయం.

Keerthi